![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -997 లో.. ఎప్పుడు స్టుడెంట్స్ భవిష్యత్తు కోసం ఆలోచించే రిషి ఇలా కాలేజీని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకునే రకం కాదని మహేంద్ర అంటాడు. తీసుకున్నారు సాక్ష్యం కూడా ఉందని చూపిస్తుంటే.. మీరు అలా అంటారేంటని వాళ్ళు అంటారు. ఈ విషయం ఇప్పుడే కదా మా వరకు తీసుకొని వచ్చింది.. మేమ్ బోర్డు మెంబెర్స్ తో డిస్కషన్ చేస్తాం.. మాకు ఇరవై నాలుగు గంటల సమయం కావాలని అనుపమ వాళ్ళని రిక్వెస్ట్ చెయ్యడంతో వాళ్ళు సరే అంటారు.
ఆ తర్వాత ఏంటి మేడమ్ ఇదంతా అని బోర్డు మెంబర్స్ అంటారు. కాసేపటికి అందరు వెళ్ళిపోతారు. శైలేంద్ర మాత్రమే ఉండి వసుధారతో మాట్లాడుతాడు.. నన్ను చెంపదెబ్బ కొట్టావో లేదో నీకు ఈ పరిస్థితి వచ్చేలా చేసానని శైలేంద్ర అంటాడు. దీని వెనకాల ఉండి నడిపిస్తుంది నువ్వే కదా నాకు తెలుసని వసుధార అంటుంది. ఎట్టి పరిస్థితిలోను కాలేజీనీ వాళ్ళ చేతుల్లోకి వెళ్లనివ్వనని వసుధార చెప్తుంది. ఈ ప్రాబ్లెమ్ నుండి ఎలా బయట పడుతావో చూస్తానని శైలేంద్ర అనుకుంటాడు. మరొకవైపు ఇక్కడే ఉంటే ముందు ముందు ఇంక ఎన్ని ప్రాబ్లెమ్ క్రియేట్ చేస్తాడో ఆ శైలెంద్ర అని భావించిన మహేంద్ర.. అక్కడ నుండి దూరంగా వసుధార, అనుపమలని తీసుకొని వెళ్ళాలని బ్యాగ్ సర్దుతుంటే అనుపమ వద్దని అంటుంది వసుధార ఇందుకు ఒప్పుకోదని మహేంద్రకి అనుపమ చెప్తుంది. అప్పుడే వసుధార వస్తుంది. తనకి విషయం తెలిసి వద్దు మావయ్య.. నేను ఎక్కడికి రాను. ఈ కాలేజీలో నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. కాలేజీని వదిలి రానని వసుధార అంటుంది. జగతి రిషీలని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నీకు ఏమైన అయితే నేను తట్టుకోలేనమ్మా అని వసుధారతో మహేంద్ర అంటాడు. నేను ఈ ప్రాబ్లెమ్ ని సాల్వ్ చేస్తానని వసుధార చెప్తుంది.
.webp)
ఆ తర్వాత వసుధార తెలిసిన వాళ్ళందరిని డబ్బులు అడుగుతుంది కానీ అందరు లేవనే చెప్తారు. మరొకవైపు ఆ వసుధారని చాలా బాగా ఇరికించావ్.. ఇక ఆ ఎండీ చైర్ లో నువ్వే కుర్చుంటావని శైలేంద్రతో దేవయాని అనగానే.. అది జరగదని ధరణి అంటుంది. ఇన్నిసార్లు అలానే అనుకున్నారు.. ఎప్పుడైనా జరిగిందా అని ధరణి అంటుంది. ఇప్పుడు జరుగుతుంది.. పిన్ని లేదు రిషి లేడని శైలేంద్ర అంటాడు. ఏమో రిషి వచ్చి వసుధారకి హెల్ప్ చేస్తాడేమోనని ధరణి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
![]() |
![]() |